ఆదివారం 19/11 మన తెలుగు కథలు
ఆదివారం 19/11 మన తెలుగు కథలు
తేదీ: ఆదివారం, నవంబర్ 19, 2023
సమయం: సాయంత్రం 4గం
స్థానం: కుతుబ్నా కల్చరల్ సెంటర్
సిటీ అవెన్యూస్, నాద్ అల్ హమర్, దుబాయ్
రిజిస్ట్రేషన్ ఫీజు: 30 దిర్హామ్‌లు
మన తెలుగు కథలు : ఉపాధ్యాయురాలు మరియు కథకురాలు హారిక ప్రకాష్‌తో తెలుగు కథలు వినేందుకు అందరు ఆహ్వానితులే. కథల ద్వారా చిన్న పిల్లలకు తెలుగును పరిచయం చేయడానికి,ఈవిడ పిల్లలకు తెలుగు కథలు చదివి
వినిపిస్తారు. ప్రపంచీకరణ కారణంగా ముఖ్య భాష ఆంగ్లం అయ్యేసరికి, పిల్లలకి మాతృభాషలో మాట్లాడే అవకాశం తగ్గిపోతుంది. మన మాతృభాషలను సజీవంగా ఉంచడం చాలా ముఖ్య మని హారిక కథల ద్వారా తెలుగుని పిల్లలకి
పరిచయం చేయాలని "మన తెలుగు కథలు" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కథలే కాకుండా ఆమె పిల్లలు
నేర్చుకునేందుకు సరదాగా ఉండే కొన్ని పాటలు కూడా పిల్లలతో కలిసి పాడుతారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
హారిక ప్రకాష్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న ఒక భారతీయ ఉపాధ్యాయురాలు,8 ఏళ్ల బాలిక తల్లి మరియు కథకురాలు. ఆమె కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉంది మరియు దాదాపు 10
సంవత్సరాలు సాఫ్ట్వేర్ఇంజనీర్గా పని చేసారు.తల్లి అయిన తర్వాత ఆమె వాళ్ళ అమ్మాయికి కథలు చదువుతూ తనకు కథల పట్ల ఉన్న మక్కువ గమనించి వివిధ కథలు, పుస్తకాల ద్వారా తెలుగు నేర్పిస్తున్నారు...ఆమె ప్రస్తుతం
పిల్లల కోసం తెలుగు మరియు ఆంగ్లంలో వర్చువల్ స్టోరీ క్లబ్‌ను మొదలుపెట్టారు. కథలు చెప్పుకుంటూ పిల్లలతో సంభాషిస్తే పిల్లలు వాళ్ళ అభిప్రాయాలూ , ఇష్టాలు, అయిష్టాలు మరియు భయాల గురించి సులభంగా వ్యక్తం చేస్తారని ఆమె నమ్మకం.